Share News

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:30 PM

పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ
Mohammad Nawaz

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది. నవాజ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలో నవాజ్ డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఐసీసీ.. పీసీబీని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పీసీబీ.. తుది నివేదికను ఐసీసీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.


తాజా పరిణామంతో నవాజ్‌కు ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు సంబంధించిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో కుదిరిన ఒప్పందం రద్దయింది. టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే ఎన్ఓసీ కూడా జారీ అయినప్పటికీ ఈ వివాదం కారణంగా అతని ఎంపిక నిలిచిపోయింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో నవాజ్ ప్రదర్శన కూడా తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం 7 మ్యాచ్‌లలో 15 పరుగులు మాత్రమే చేసి, 7 వికెట్లు తీశాడు. కాగా పాకిస్థాన్ జట్టు సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే మొత్తంగా టీ20ల్లో నవాజ్ రికార్డు మాత్రం గణనీయంగానే ఉంది. పాకిస్థాన్ తరఫున 98 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా 911 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడుతున్న నవాజ్.. తాజా మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా జట్టు విజయంలో భాగమయ్యాడు. ఈ వివాదం అతడి భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చినా.. ఇషాన్ కిషనే కెప్టెన్‌గా ఉండాలి: సంజయ్ బంగర్

హార్దిక్‌తో విభేదాలు.. కృనాల్ పాండ్య రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 22 , 2026 | 05:48 PM