భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:35 PM
ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ పీటర్ సిడిల్‌పై నిషేధం పడింది. భారత్‌కు చెందిన ఓ లీగ్‌లో ఆడినందుకు అతడిపై ఓ లీగ్ వేటు వేసింది. గోవా వేదికగా ది వరల్డ్ లెజెండ్స్ ప్రో లీగ్ జరిగింది. ఇందులో పీటర్ సిడిల్ ఆడాడు. అయితే ఆ లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ పీటర్ సిడిల్‌పై నిషేధం పడింది. భారత్‌కు చెందిన ఓ లీగ్‌లో ఆడినందుకు అతడిపై ఓ లీగ్ వేటు వేసింది. గోవా వేదికగా ది వరల్డ్ లెజెండ్స్ ప్రో లీగ్ జరిగింది. ఇందులో పీటర్ సిడిల్ ఆడాడు. అయితే ఆ లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇంగ్లండ్‌లో జరిగే టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు వీలులేకుండా పోయింది. ఆసీస్ తరఫున 67 టెస్టులు ఆడిన పీటర్.. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికి చాలా కాలమైంది. ఇప్పుడు కేవలం టీ20 ఫార్మాట్ లీగ్‌ల్లోనే ఆడుతున్నాడు. టీ20 బ్లాస్ట్‌కు వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండటం లేదని ఇటీవలే పీటర్ తెలిపాడు. అసలు విషయం మాత్రం అడిపై వేటు పడటం వల్లే అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. అనుమతి లేని టోర్నీల్లో పాల్గొనే ప్లేయర్లకు తమ దేశంలోని లీగుల్లో ఆరు నెలల వరకు ఆడే అవకాశం ఉండదు. బీసీసీఐ అనుమతి లేని ది వరల్డ్ లెజెండ్స్ ప్రో లీగ్‌లో ఆడినందుకు.. ఇంగ్లండ్‌కు చెందిన టీ20 బ్లాస్ట్‌లో ఆడకుండా పీటర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ మేరకు నాటింగ్‌హామ్‌షైర్ కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సీజన్‌లో పీటర్ సిడిల్ సేవలను కోల్పోతున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం సిడిల్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆసీస్ తరఫున 67 టెస్టులు, 20 వన్డేలు, 2 టీ20లను ఆడాడు. చివరిసారిగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇవి కూడా చదవండి:
ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చినా.. ఇషాన్ కిషనే కెప్టెన్‌గా ఉండాలి: సంజయ్ బంగర్
హార్దిక్‌తో విభేదాలు.. కృనాల్ పాండ్య రియాక్షన్ ఇదే!