Share News

కోహ్లీ లాంటోడే కావాలి.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:19 PM

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై బిగ్‌బాస్ 13 ఫేమ్, ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ షెఫాలీ బగ్గా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వార్తలతో తాను విసిగిపోయానని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

కోహ్లీ లాంటోడే కావాలి.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్
Shefali Bagga Yuzvendra Chahal dating rumors

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై బిగ్‌బాస్ 13 ఫేమ్, ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ షెఫాలీ బగ్గా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వార్తలతో తాను విసిగిపోయానని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఒక చిన్నపాటి పార్టీలో కలిసి డిన్నర్ చేసినంత మాత్రాన డేటింగ్ అంటూ ప్రచారాం చేస్తారా? అంటూ షెఫాలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ షెఫాలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ..'చాహల్‌తో డిన్నర్ చేసిన విషయం మీరు అడుగుతారని నాకు తెలుసు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని నాకు అస్సలు లేదు. ఎందుకుంటే.. ఇలాంటి వార్తలు విని విసుగొచ్చింది. వాస్తవం ఏంటో నాకు, నా ఆత్మీయులకు తెలుసు. నాకు క్రికెటర్లతో డేటింగ్ చేసే ఉద్దేశం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్ అనేది నా వృత్తి. నా ప్రొఫెషన్, వ్యక్తిగత జీవితాన్ని కలిపే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే క్రికెటర్లతో డేటింగ్ చేసే ఆలోచన నాకు లేదు' అని ఆమె పేర్కొంది.


'నేను విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు అభిమానిని. వాళ్లకి పెళ్లైపోయింది. ఇక మిగిలిన వాళ్లు బహుశా నాకంటే చిన్నవాళ్లు. పెళ్లి విషయంలో నాకు విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి. అతను ఎంత బిజీగా ఉన్నా అనుష్క పట్ల చూపించే ప్రేమ, అంకితభావం, ఆరాధన నాకు బాగా నచ్చింది. నాకు వచ్చే భాగస్వామి కూడా కోహ్లీలా నాతో ఉన్నప్పుడు పూర్తిగా నాకే సమయం కేటాయించాలి. నా పార్ట్‌నర్‌కు లగ్జరీల కంటే ప్రేమించే మనసు, నన్ను జాగ్రత్తగా చేసుకునే గుణం ఉంటే చాలు. ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి లాంటి విషయాల కంటే నా కెరీర్‌కే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను' అని షెఫాలీ తెలిపింది.


ఇవి కూడా చదవండి:

డేంజరస్ పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు

ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో

Updated Date - Apr 22 , 2026 | 03:43 PM