Share News

ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చినా.. ఇషాన్ కిషనే కెప్టెన్‌గా ఉండాలి: సంజయ్ బంగర్

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:21 PM

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుని కమిన్స్ జట్టులోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చినా.. ఇషాన్ కిషనే కెప్టెన్‌గా ఉండాలి: సంజయ్ బంగర్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుని కమిన్స్ జట్టులోకి రాబోతున్నాడు. ఏప్రిల్ 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచులో అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇషాన్ కిషన్‌ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. దీంతో అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ మాట్లాడాడు.


‘ఇషాన్ కిషన్ నాయకత్వంలో స్పష్టత ఉంది. ఎవరిని ఎప్పుడు బౌలింగ్‌కు పంపాలో బాగా అర్థం చేసుకున్నాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జట్టుకు స్థిరత్వం అవసరం. కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చినా ఇప్పుడే మైదానంలోకి దిగే అవకాశాలు ఉండవు. ఆటలో ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం. జట్టు ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కెప్టెన్‌ను మార్చడం తగదు. ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలి’ అని సంజయ్ బంగర్ వెల్లడించాడు.


మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో ఏకంగా 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభిషేక్ విధ్వసంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఢిల్లీ జట్టు నితీష్ రాణా (57), కేఎల్ రాహుల్ (37) పోరాడినప్పటికీ ఫలితం లేదు. 243 లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ.. 195 పరుగులకే పరిమితమైంది. దీంతో ఏడింట్లో నాలుగు మ్యాచులు గెలిచిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఆరు మ్యాచులు ఆడి 3 గెలిచిన ఢిల్లీ.. ఐదో స్థానంలో నిలిచింది.


ఇవి కూడా చదవండి:

డేంజరస్ పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు

రైజర్స్‌.. రయ్‌ రయ్‌

Updated Date - Apr 22 , 2026 | 03:49 PM