మరోసారి సెంచరీతో చెలరేగిన సంజు.. ముంబై టార్గెట్ 208
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:21 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్(101*) మరోసారి సెంచరీతో చెలరేగాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్(101*) మరోసారి సెంచరీతో చెలరేగాడు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21, కార్తీక్ శర్మ 18 , జామీ ఓవర్టన్ 15 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో ఏఎం గజన్‌ఫర్, అశ్వనీ కుమార్ చెరో రెండు వికెట్లు సాధించారు. మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(14 బంతుల్లో 22 పరుగులు), సంజు శాంసన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ధాటిగా ఆడుతున్న క్రమంలో జట్టు 32 పరుగుల వద్ద గైక్వాడ్ తొలి వికెట్‌గా వెనుతిరిగాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(14) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అయితే.. సర్ఫరాజ్ ఖాన్ సాయంతో సంజు ముంబై బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆ తర్వాత కూడా మిగిలిన సీఎస్కే బ్యాటర్ల సపోర్టుతో సంజు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. ఇక సంజు మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ముంబై ముందు 208 పరుగుల భారీ టార్గెట్‌ను సీఎస్కే ఉంచింది. ఈ సీజన్‌లో సంజుకు ఇది రెండో సెంచరీ. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 52 బంతుల్లో 115 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
సరికొత్త చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్
కీలక టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్