Share News

సరికొత్త చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:53 PM

దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. నిన్న జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వి​కెట్ల తేడాతో భారత్ ఓడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

 సరికొత్త చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్
Harmanpreet Kaur record

స్పోర్ట్స్ డెస్క్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. నిన్న(బుధవారం) జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వి​కెట్ల తేడాతో భారత్ ఓడింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది.


గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3,016) పేరిట ఉండేది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. ఇప్పటివరకు భారత కెప్టెన్‌గా 3,017 పరుగులు చేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్ చెలరేగి ఆడింది. 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక.. అత్యధిక ఈ జాబితాలో 2,619 పరుగులతో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెక్ లానింగ్ మూడో స్థానంలో ఉంది.


మూడో టీ20లో ఓపెనర్ షెఫాలీ వర్మ (64) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, స్మృతి మంధాన 37 పరుగులతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ప్రోటీస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ (115) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఉమెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు..

  • హర్మన్‌ ప్రీత్ కౌర్ - 3,017

  • చమరి ఆటపట్టు - 3,016

  • మెక్ లానింగ్ - 2,619

  • షార్లెట్ ఎడ్వర్డ్స్ - 2,529

  • సూజీ బేట్స్ - 2,236


ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 23 , 2026 | 09:22 PM