Share News

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:56 PM

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎస్కే స్టార్ పేసర్ ముకేశ్‌ చౌదరి తల్లి కన్నుమూశారు. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం
Mukesh Chaudhary

స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎస్కే స్టార్ పేసర్ ముకేశ్‌ చౌదరి తల్లి కన్నుమూశారు. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్తతో సీఎస్కే శిబిరం విషాదంలో మునిగిపోయింది. సీఎస్కే యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ముకేశ్‌ కుటుంబానికి సానుభూతి తెలియజేసింది. కష్ట సమయంలో ముకేశ్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. గాయాలు, ఫామ్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు.. తాజాగా ఇది మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.


ఇక తల్లి ప్రేమ్ దేవి అంత్యక్రియల కోసం ముకేశ్ స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ(గురువారం)ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఖలీల్‌ స్థానాన్ని గత మ్యాచ్‌లో భర్తీ చేసిన ముకేశ్‌ కూడా ఇప్పుడు వ్యక్తిగత కారణంగా జట్టుకు దూరం కావడంతో సీఎస్కే బౌలింగ్‌ కూర్పులో మార్పులు అనివార్యమయ్యాయి. న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్‌ హెన్రీని జట్టులోకి తీసుకుంటే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.


ఐపీఎల్ 2026 ప్రారంభం నుంచే సీఎస్కేను సమస్యలు వెంటాడుతున్నాయి. ధోని ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బ్రెవిస్‌ ఆరంభంలో పలు మ్యాచ్‌లు మిస్‌ అయ్యాడు. మంచి టచ్‌లో ఉన్న ఆయుశ్‌ మాత్రే, ఖలీల్‌ అహ్మద్‌ గాయాల కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టు కేవలం రెండు గెలిచి, నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత వరుసగా రెండు గెలిచినప్పటికీ, సీఎస్కే తమ చివరి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ తరుణంలో ఉన్న కొందరు అడపాదడపా రాణించే ప్లేయర్లు కూడా దూరం కావడంతో సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ

రాజస్థాన్‌ లాగేసుకుంది

Updated Date - Apr 23 , 2026 | 06:33 PM