Share News

టాస్ గెలిచిన ముంబై జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే...

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:02 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ గెలిచిన ముంబై జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే...
MI VS KKR

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో లీగ్ నుంచి తప్పుకున్న ఆయుశ్ మాత్రే స్థానంలో ఉత్తరాఖండ్ ప్లేయర్ ఆకాశ్ మధ్వాల్‌కు అవకాశం కల్పించింది. రెండూ ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లే. చెరో ఐదు సార్లు టైటిల్ గెల్చుకున్నాయి. కానీ, ఈ సీజన్‌లో రెండూ జట్లూ తడబడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో, సీఎస్కే ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.


తుది జట్లు

ముంబై ఇండియన్స్:

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, ఏఎం గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

ఇంపాక్ట్ సబ్‌లు: విల్ జాక్స్, రాజ్ బావా, శార్దూల్ ఠాకూర్, డానిశ్ మలేవార్, మయాంక్ మార్కండే

చెన్నై సూపర్ కింగ్స్:

సంజు శాంసన్( వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబె, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేశ్ చౌదరి

ఇంపాక్ట్ సబ్‌లు: ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీ, అకీల్ హోసేన్, ఉర్విల్ పటేల్


ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 23 , 2026 | 07:14 PM