Share News

ఐపీఎల్ 2026: చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:42 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

ఐపీఎల్ 2026: చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే అభిమానులకు ఓ అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ మ‌ధ్యలోనే వైదొలిగిన యువ ఆట‌గాడు ఆయుష్ మాత్రే స్థానాన్ని సీనియ‌ర్ పేస‌ర్ ఆకాశ్ మ‌ధ్వాల్‌తో సీఎస్కే భ‌ర్తీ చేసింది. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా గురువారం సీఎస్కే యాజమాన్యం ప్రక‌టించింది. రూ.30 ల‌క్షల బేస్‌ప్రైస్‌కు మ‌ధ్వాల్‌ను చెన్నై కొనుగోలు చేసింది.


ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ మ‌ధ్వాల్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉంది. ఐపీఎల్ 2023లో తొలిసారి వెలుగులోకి వచ్చాడు. 2023-24 వరకు ముంబై ఇండియ‌న్స్‌ తరఫున, 2025లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తరఫున ఆడాడు. డెత్ ఓవ‌ర్లలో యార్కర్లు వేయడం మాధ్వాల్ ప్రత్యేకత. ఇప్పటివరకు 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్‌ 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఎంఐ తరఫున 5 పరుగులకే 5 వికెట్లు తీసిన అద్భుత ప్రదర్శన కూడా ఉంది. ఆకాశ్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.


ఇక చెన్నై జట్టుకు ఈ ఏడాది సీజన్‌లో కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే రెండింట మాత్రమే విజయం సాధించింది. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో గ‌త రెండు మ్యాచ్‌ల‌కు వారిని సీఎస్కే బెంచ్‌కే ప‌రిమితం చేసింది. గురువారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ

Updated Date - Apr 23 , 2026 | 06:33 PM