Home » MS Dhoni
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో కలిసి వచ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ మహేంద్ర సింగ్ ధోనికి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో వివాద రహితుడిగా, మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోనికి నోటీసులు రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.