Share News

మహేంద్ర సింగ్ ధోనికి భారీ షాక్!

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:19 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్ మహేంద్ర సింగ్‌ ధోనికి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో వివాద రహితుడిగా, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోనికి నోటీసులు రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 మహేంద్ర సింగ్ ధోనికి భారీ షాక్!
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి(MS Dhoni) బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో వివాదరహితుడగా, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోనికి నోటీసులు రావడంపై అతడి అభిమానులతో పాటు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం...


జార్ఖండ్‌లోని హర్మూ రోడ్‌లో గృహ అవసరాల నిమిత్తం ధోని రెసిడెన్షియల్‌ ప్లాట్‌ సొంతం చేసుకున్నాడు. దీనిని కేవలం నివాస స్థలంగా మాత్రమే ఉపయోగించాలని జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు(Jharkhand Housing Board) స్పష్టం చేసింది. అయితే, ఈ ప్లాట్‌లో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నడుపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడి నుంచి ధోని కొత్త ఇంటికి మారిన తర్వాతే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో హౌసింగ్‌ బోర్డు విచారణ చేపట్టి.. ధోనికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశమని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ధోనిపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే అతడికి ఇచ్చిన ప్లాట్ కేటాయింపును రద్దు చేస్తారు.


హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ సంజయ్‌ లాల్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. 'గృహ అవసరాల నిమిత్తమే ఈ ప్లాట్‌ను ధోనికి కేటాయించాము. అక్కడ వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అందుకే ధోనికి నోటీసులు జారీ చేశాము. అయితే, ధోని ఒక్కరికే కాకుండా హర్మూ రోడ్డులో ప్లాట్లు సొంతం చేసుకున్న మరికొందరిపై కూడా ఇలాంటి ఆరోపణలే రాగా.. వారిని కూడా నోటీసులు జారీ చేశాము. ఒకవేళ ఆరోపణలు(commercial activities) నిజమని తేలితే వారి కేటాయింపులను రద్దు చేసి... ప్లాట్లను వెనక్కి తీసుకుంటాము' అని ఆయన స్పష్టం చేశారు. తన అద్భుతమైన సారథ్య నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ(ICC) టైటిళ్లు అందించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని నేటికీ కొనసాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

Updated Date - Feb 28 , 2026 | 02:32 PM