పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:19 AM
టీ20 ప్రపంచ కప్2026 సూపర్ -8లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభంకానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్ -8లో భాగంగా ఇవాళ(శనివారం) మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభం కానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడినా, మాములు విజయం సాధించినా... ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక దారిలోనే పాకిస్థాన్ పయనం ఉంటుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్ వేళ.. పాకిస్థాన్ అభిమానులను వరుణుడు భయపెడుతున్నాడు. మరి.. మ్యాచ్ జరిగే పల్లెకెలె ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
వెదర్ రిపోర్ట్ ఇదే:
గత కొన్ని రోజులుగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొట్టి ప్రపంచ కప్2026లోని పలు మ్యాచులను ఈ వర్షం ప్రభావితం చేసింది. వాన కారణంగా లీగ్ దశలో పలు మ్యాచులు రద్దుకాగా.. సూపర్-8లో న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఆగిపోయింది. ఇదే గ్రూప్-2లోని సెమీస్ బెర్తుపై ప్రభావం చూపింది. ఇవాళ జరిగే శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంతో సెమీ ఫైనల్‌కు చేరే జట్టు ఏదో తేలనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు వాన ముప్పు చాలా తక్కువగానే ఉందని తెలుస్తోంది. పల్లెకెలెలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 30 నుంచి 40 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. మరోవైపు శ్రీలంక జట్టు తమ సొంత గడ్డపై ఆడుతుండటం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేదా బ్యాటర్లకు సహకరిస్తుందా అనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్ 2 పాయింట్ల పట్టిక:
ఇంగ్లండ్: 6 పాయింట్లు, 3 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +1.096
న్యూజిలాండ్: 3 పాయింట్లు, 3 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్+1.390
పాకిస్థాన్: 1 పాయింట్, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -0.461
శ్రీలంక : 0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -2.800
ఇవి కూడా చదవండి:
స్వీట్ వార్నింగ్: అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్..
టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!