Share News

స్వీట్ వార్నింగ్: అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్..

ABN , Publish Date - Feb 28 , 2026 | 10:06 AM

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటైన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

స్వీట్ వార్నింగ్: అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్..
Abhishek Sharma

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు తన మెంటార్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటైన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. బ్యాట్‌తోనే తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చాడు.


ఈ ఇన్నింగ్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. అభిషేక్ శర్మ సెలెబ్రేట్ చేసుకున్నాడు. 'కృతజ్ఞతతో ఉన్నాను. టార్గెట్ పై దృష్టి పెట్టి.. ముందుకు సాగుతున్నాను'అని క్యాప్షన్ ఇచ్చాడు. అందరూ అభిషేక్ శర్మకు కంగ్రాట్స్ చెప్తుంటే.. యువరాజ్ సింగ్(Yuvraj Singh) మాత్రం రిఫరెంట్ గా రిప్లయ్ ఇచ్చాడు. అభిషేక్ పోస్టుకు ఓ చెప్పు ఎమోజీని యువీ కామెంట్‌గా పెట్టాడు. దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువీ ఇలా చెప్పు ఎమోజీ పెట్టడం ఇదే తొలిసారి. ఆటపై మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే యువీ మందలించాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవైపు స్వీట్ వార్నింగ్ ఇచ్చి.. మరోవైపు అభిషేక్ శర్మ ప్రదర్శనను కొనియాడుతూ యువరాజ్.. తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ' నీవు బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వడమనేది ఉత్తమమైన వ్యక్తిత్వం. మంచి ఇన్నింగ్స్ అభిషేక్. ఇలానే ముందుకు సాగండి' అని యువరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాశాడు.


మరోవైపు జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. జట్టు సపోర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా కంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యాను. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా(Team India) డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేం ఒక జట్టులా కాకుండా కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి ఉత్తమ ఆట రావాలని జట్టు కోరుకుంటుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తూ.. నేను కూడా ఎదురు చూస్తున్నా'అని అభిషేక్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

Updated Date - Feb 28 , 2026 | 10:14 AM