టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్
ABN , Publish Date - Feb 28 , 2026 | 07:34 AM
టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న(శుక్రవారం)అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో రింకు సింగ్ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలమైన అలీఘర్‌కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అంతటి విషాదంలో ఉండి కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తండ్రి చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకు సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘తండ్రి అంత్యక్రియలకు రింకు హాజరయ్యాడు. తన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు. అతడు తిరిగి జట్టులో చేరుతాడు’ అని చెప్పారు. మరోవైపు.. రింకు సోదరుడు మాట్లాడుతూ.. ‘మా నాన్న అంత్యక్రియల కోసం రింకు ఇక్కడికి వచ్చాడు. ఆ కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో జరిగే వెస్టిండీస్ మ్యాచ్ కోసం రింకు తిరిగి జట్టుతో చేరతాడు’ అని స్పష్టం చేశాడు.
మరోవైపు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 భాగంగా టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రింకు టీ20 ప్రపంచ కప్ 2026లో ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్ దశలో నాలుగు, సూపర్-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులు మాత్రమే చేశాడు. ఏది ఏమైనా వెస్టిండీస్ తో జరిగే కీలక పోరుకు... రింకు అందుబాటులో ఉండటం శుభపరిణామమే.
ఇవి కూడా చదవండి: