పాకిస్థాన్ ఇలా నెగ్గాలి..
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:44 AM
చివరి రెండు ఓవర్లలో సంచలన ప్రదర్శన కనబరచిన ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించడంతో వరల్డ్ కప్‌లో మిణుకుమిణుకు మంటున్న పాకిస్థాన్ సెమీస్ ఆశలు కాసింత ఊపిరి పోసుకున్నాయి...
శ్రీలంకతో నేడు చావో రేవో మ్యాచ్
రాత్రి 7 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
పల్లెకెలె : చివరి రెండు ఓవర్లలో సంచలన ప్రదర్శన కనబరచిన ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించడంతో వరల్డ్ కప్‌లో మిణుకుమిణుకు మంటున్న పాకిస్థాన్ సెమీస్ ఆశలు కాసింత ఊపిరి పోసుకున్నాయి. ఈనేపథ్యంలో శనివారం ఇక్కడ జరిగే అతి కీలక మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన సూపర్-8 రెండు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షంతో రద్దయి, మరో పోటీలో ఓడిన పాకిస్థాన్ (-0.461) కేవలం ఒక పాయింట్‌తో ఉంది. మరోవైపు మొత్తం మూడు పాయింట్లతో సూపర్-8 మ్యాచ్‌లను కివీస్ (+1.390) పూర్తి చేసింది. దాంతో శ్రీలంకతో మ్యాచ్‌లో పాకిస్థాన్ 64 పరుగులతో విజయం సాధించాలి. చేజింగ్‌లో అయితే లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో పూర్తి చేయాలి. ఇది జరిగితే న్యూజిలాండ్‌ను పక్కకునెట్టి పాకిస్థాన్ సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. లేదంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ