రెండో వన్డేలోనూ చిత్తుగా..
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:42 AM
బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పరుగులు సులువుగా లభించినా..భారత బ్యాటర్లు చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. మరోవైపు వికెట్‌ను సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టులో జార్జియా వాల్...
జార్జియా వాల్ సెంచరీ
భారత్‌పై ఆసీస్ ఘన విజయం
హోబర్ట్ : బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పరుగులు సులువుగా లభించినా..భారత బ్యాటర్లు చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. మరోవైపు వికెట్‌ను సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టులో జార్జియా వాల్ (101) సెంచరీతో కదం తొక్కింది. లిచ్‌ఫీల్డ్ (80) ధనాధన్ బ్యాటింగ్‌తో మెరిసింది. ఫలితంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు ఐదు వికెట్లతో గెలుపొందారు. తొలి మ్యాచ్‌లోనూ ఆతిథ్య జట్టు నెగ్గిన విషయం తెలిసిందే. మొదట భారత్ 50 ఓవర్లలో 251/9 స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (54), ఓపెనర్ ప్రతికా రావల్ (52) అర్ధ శతకాలతో సత్తా చాటారు. ఛేదనలో వాల్, లిచ్‌ఫీల్డ్‌కు తోడు బెత్ మూనీ (31) రాణించడంతో ఆసీస్ 36.1 ఓవర్లలో 252/5 స్కోరు చేసి నెగ్గింది.
హర్మన్, ప్రతిక హాఫ్ సెంచరీలు..: పిచ్ నుంచి సహకారం అందినా..చెత్త షాట్లతో వికెట్లు పారేసుకొన్న భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ప్రతిక, మంధాన తొలి వికెట్‌కు 78 పరుగులతో శుభారంభం అందించారు. మంధాన, ప్రతిక నిష్క్రమణ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కాగా..కశ్వీ గౌతమ్ (25) జతగా హర్మన్ ఏడో వికెట్‌కు 55 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసింది. దాంతో టీమిండియా స్కోరు 200 దాటింది. ఇక..మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్‌తో కూడిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీ్‌సలో..టీ20లను భారత్ 1-2తో నెగ్గిన సంగతి తెలిసిందే. మరో వన్డే, టెస్ట్ జరగాల్సి ఉంది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ