Share News

ఐపీఎల్ 2026: ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడుతాడు: సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:34 PM

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఐపీఎల్ 2026: ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడుతాడు: సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లంతా సన్నద్ధమవుతున్నారు. అయితే ఐపీఎల్ అనగానే అభిమానుల్లో మెదిలేది ఒక్కటే ప్రశ్న.. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ బరిలోకి దిగుతాడా? లేదా? చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీపైనే ఈసారి కూడా అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.


‘ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లోనూ ఆడతాడు. అన్ని మ్యాచుల్లోనూ బరిలోకి దిగుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగిస్తారా? అంటే దాని గురించి నేనేం మాట్లాడలేను. అది క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. స్టాఫ్ ఈ నిర్ణయం తీసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకునేది కాదు. బ్యాటర్‌గా ఆడతాడా? వికెట్ కీపర్‌ కమ్ బ్యాటర్‌గానా? ఇంపాక్ట్ ప్లేయర్‌గానా? అనేది వారు డిసైడ్ చేస్తారు’ అని స్పష్టం చేశారు.


దాని కోసం ఎదురుచూస్తున్నా..

‘టీమిండియా వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గడం సంతోషంగా ఉంది. అందులో సీఎస్కే ప్లేయర్లు సంజు శాంసన్, శివమ్ దూబే అద్భుతంగా ఆడారు. వారి స్ఫూర్తితో ఐపీఎల్‌లో సీఎస్కే ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేస్తారని భావిస్తున్నా. ఇక మా మ్యాచులన్నింటినీ చెన్నై వేదికగా ఆడతాం. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో.. ఆటగాళ్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. పూర్తి స్థాయి షెడ్యూల్ కోసం మేమూ వేచి చూస్తున్నాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 11 , 2026 | 06:35 PM