డగౌట్‌లో కోచ్ స్థాయిలో ఉండి నవ్వలేను: గౌతమ్ గంభీర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:11 PM
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా గౌతీ ముఖంలో నవ్వు ఉండదని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతుంటారు. అయితే వీటన్నింటిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించింది. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా గౌతీ ముఖంలో నవ్వు ఉండదని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతుంటారు. అతడు నవ్వితే చూడాలంటూ సెటైరికల్‌గా మాట్లాడుతుంటారు. అయితే వీటన్నింటిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఎందుకు తాను ఎక్కువగా డగౌట్‌లో సీరియస్‌గా ఉంటాడనే దానిపై వివరణ ఇచ్చాడు.
‘నా నవ్వుపై కామెంట్లు చేసేవారు ఎప్పుడూ ఇలాంటి బాధ్యతల్లో ఉండి ఉండరు. కఠిన పరిస్థితులు ఉన్నప్పుడు డగౌట్‌లో కోచ్‌గా నేను నవ్వుతూ ఉండలేను. భారత జట్టుపై ఎప్పుడైనా భారీ అంచనాలు ఉంటాయి. ఇక్కడ ఓటమి అనేది ఆప్షన్ కాకూడదు. ప్రతి వరల్డ్ కప్‌ను టీమిండియానే నెగ్గాలని కోరుకుంటారు. ప్రతిసారీ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది స్పోర్ట్స్. మీ జీవితమంతా వెచ్చించినా సత్ఫలితాలు వస్తాయని గ్యారంటీ లేదు. ఇదేమీ షేర్ మార్కెట్ కాదు కదా’ అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.
అయితే టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ కోల్పోతుండటంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే టీ20 ఫార్మాట్లో మాత్రం గంభీర్ కోచ్‌గా అజేయంగా నిలిచాడు. అతడి నేతృత్వంలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్