Share News

తొలి వన్డే: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:07 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాభవాన్ని చవి చూసింది. బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తొలి వన్డే: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ODI series

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. దాంట్లో భాగంగా నేడు ఢాకా వేదికగా తొలి వన్డే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాభవాన్ని చవి చూసింది. బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


బంగ్లా బ్యాటర్ హసన్ తమీమ్(67*) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. లిట్టన్ దాస్(3*) నాటౌట్‌గా ఉన్నాడు. సైఫ్ హస్సన్(4), నజ్ముల్ హుస్సేన్ శాంటో(27) పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, వాసిమ్ జూనియర్ తలొక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 30.4 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఫహీమ్ అష్రఫ్(37) టాప్ స్కోరర్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో రెండు సెంచరీలు సాధించిన ఫర్హాన్(27) ఇక్కడ విఫలమయ్యాడు. రిజ్వాన్(10), సాధాక్(18) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో నహీద్ రాణా 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హసన్ మిరాజ్ 3, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 11 , 2026 | 06:10 PM