Home » MLC Kavitha
బీఆర్‌ఎ్‌సలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్ష గట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖలను లీక్ చేసిన కుట్ర దారులెవరో బయట పెట్టాలని కోరినందుకు..
బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా సింగరేణిలో పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, బీసీ నాయకులతో ఆమె సోమవారం సమావేశమయ్యారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ సభకు రమ్మని పిలిస్తే.. వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు.
తెలంగాణలో కక్ష సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని పదే పదే చెప్పింది చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు..