Share News

Kavitha: తండ్రి కోసం కవిత న్యాయ పోరాటం!

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:52 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.

Kavitha: తండ్రి కోసం కవిత న్యాయ పోరాటం!

  • కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై నిపుణులతో చర్చలు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. కాళేశ్వరం కమిషన్‌ (పీసీ ఘోష్‌ కమిషన్‌) నివేదికపై రెండు రోజులుగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ గతంలో ఇందిరాపార్క్‌ వద్ద కవిత ధర్నా చేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు కమిషన్‌ నివేదిక పేరుతో కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్రలను, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ ముందే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దేశంలో ఇప్పటి వరకు వేసిన జ్యూడిషియల్‌ కమిషన్లు, వాటి నివేదికలు, ఆయా నివేదికలపై న్యాయస్థానాల్లో అప్పీళ్లు, వాటిపై న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులపై చర్చించినట్లు తెలిసింది. అసెంబ్లీ, మండలిలో కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు.


బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?: చనగాని

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్‌ ఢిల్లీలో పోరాడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేయడంలో ఆంతర్యమేంటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకుండా దొంగ చాటుగా ఢిల్లీ వెళ్లి వచ్చారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే విధానంతో ఉన్నట్టు స్పష్టమవుతోందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

Updated Date - Aug 08 , 2025 | 04:52 AM