MLC Kavitha: ఎమ్మెల్సీ కమిత సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 08:29 AM
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, బీసీ నాయకులతో ఆమె సోమవారం సమావేశమయ్యారు.
- కాంగ్రెస్ కుయుక్తులను ఎండగడతాం...
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, బీసీ నాయకులతో ఆమె సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడమంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికి అమలు చేయబోమని చెప్పడమేనన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడతామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని కవిత చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News