Kavitha: కేసీఆర్ వద్దకు కవిత
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:31 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు.
కుమారుడికి ఆశీర్వాదం కోసం ఫాంహౌ్‌సకు
ఉన్నత చదువులకు అమెరికా వెళ్తున్న ఆర్య
బెడ్రూంలో తండ్రి.. బయటి నుంచే కవిత నమస్కారం
అమెరికా బయలుదేరి వెళ్లిన కవిత
హైదరాబాద్/గజ్వేల్/మర్కుక్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు. ఈ మేరకు తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సకు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ తన బెడ్రూంలో ఉన్నారు. కవిత మాత్రం బెడ్రూం బయటి నుంచే తన తండ్రికి నమస్కారం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి శోభ.. మనుమడిని బెడ్రూంలోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మనుమడు ఆర్యను ఆశీర్వదించిన కేసీఆర్ అతనితో పలు విషయాలు మాట్లాడారు. ‘‘మంచిగా చదువుకో. ఏ కోర్సులో చేరుతున్నావు? యూనివర్సిటీ పేరేంటి? అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు?’’ అని కేసీఆర్ అడగగా.. ఆర్య అన్ని వివరాలు చెప్పి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళుతున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా, కుమారుడిని అమెరికాలో కళాశాలలో చేర్పించేందుకు ఆయనతోపాటు తన పెద్ద కుమారుడు ఆదిత్యతో కలిసి కవిత శుక్రవారంరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె తిరిగి సెప్టెంబరు 1న బయలుదేరి 2న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతోపాటు పాస్‌పోర్ట్‌ను కూడా రిలీజ్ చేసింది.
శ్రీకాంతాచారి త్యాగం సదా స్మరణీయం
తన ఆత్మబలిదానంతో యావత్ తెలంగాణను స్వరాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపించిన శ్రీకాంతాచారి త్యాగం సదా స్మరణీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీేసలా వ్యవహరిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ పాలన నుంచి మన గడ్డను కాపాడుకోవడానికి శ్రీకాంతాచారి స్ఫూర్తితో పునరంకితమవుదామని ఆమె పిలుపునిచ్చారు. శ్రీకాంతాచారి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన త్యాగాన్ని కవిత స్మరించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News