Share News

Kavitha: రైతులు, పేదలపై ఎందుకింత పగ ?: కవిత

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:26 AM

‘‘కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కోసం దుర్మార్గానికి పాల్పడతారా? ముఖ్యమంత్రిగారూ.. రైతులు, పేదలపై మీకు ఎందుకింతపగ’’ అంటూ..

Kavitha: రైతులు, పేదలపై ఎందుకింత పగ ?: కవిత

‘‘కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కోసం దుర్మార్గానికి పాల్పడతారా? ముఖ్యమంత్రిగారూ.. రైతులు, పేదలపై మీకు ఎందుకింతపగ’’ అంటూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కానుకుర్తి గ్రామంపైకి అర్ధరాత్రి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండిస్తున్నామని ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయాన్ని గుర్తించాలని.. మీ డ్రీమ్‌ ప్రాజెక్టు కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Updated Date - Aug 30 , 2025 | 01:26 AM