Home » Medak
వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లతాండలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి బీసీలపై అంత ప్రేమ ఉంటే సీఎం రేవంత్‌ను గద్దె దించి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది.
పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కోల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
Congress Leader Shot Dead: హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్‌కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్‌రామ్ గూడాలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం.
సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.
ట్రాక్టర్ కిరాయి డబ్బుల కోసం, మంత్రాల నెపంతో తన అన్నను ఓ తమ్ముడు కల్లు సీసాతో పొడిచి, టవల్‌తో ఉరివేసి కిరాతకంగా చంపేశాడు.
బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోని పిల్లలు.. ఆయన చనిపోయాక అంత్యక్రియలకు రావడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మృతదేహం దరిదాపుల్లోకి కూడా వారిని వెళ్లనీయలేదు.
మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనం వద్ద విషాద ఘటన జరిగింది. పేషీకి హాజరైన భార్యాభర్తలు క్షణికావేశంలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి కిందకు దూకారు.