Bhagirath Choudhary: ఆయిల్‌పాం పరిశోధన కేంద్రానికి నిరాకరణ
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:57 AM
తెలంగాణలో ప్రత్యేకంగా ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రత్యేకంగా ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (ఐఐవోపీఆర్) దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రైతులకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని, అందువల్ల మరో కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 50 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేసే లక్ష్యానికి కేంద్రం సహకరిస్తుందని మంత్రి తెలిపారు.
మెదక్‌లో రూ.1,775 కోట్లతో లాజిస్టిక్స్ పార్కు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పార్కిబండలో రూ. 1,775 కోట్లతో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు.. మంగళవారం లోక్‌సభలో ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..