Raghunandan Rao: ‘పార్టీకి, పదవికి రాజీనామా చేయండి.. లేకపోతే చంపేస్తాం’!
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:26 AM
పార్టీకి, పదవికి రాజీనామా చేయండి లేకపోతే చంపేస్తామంటూ బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు.
రఘునందన్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు
బంజరాహిల్స్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పార్టీకి, పదవికి రాజీనామా చేయండి లేకపోతే చంపేస్తామంటూ బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఈ నెల 8వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తన కుమార్తె డాక్టర్ ఎం. సింధు ఇంటికి రఘునందన్‌రావు వచ్చారు.
ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను మావోయిస్టునని వెంటనే పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, ఎంపీ పదవిని వదులుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించాడు. దాంతో ఈ నెల 13న పోలీసులకు రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా ఇలాంటి బెదిరింపు కాల్స్ తనకు అనేకమార్లు వచ్చాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.