Home » Medak
తెలంగాణలో ప్రత్యేకంగా ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి స్పష్టం చేశారు.
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
పార్టీకి, పదవికి రాజీనామా చేయండి లేకపోతే చంపేస్తామంటూ బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో 700కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎంపీ రఘునందన్‌రావు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారులను మోసం చేసి డబ్బులు దండుకున్న ఓ మేస్త్రీ పరారైన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి తండాలో వెలుగులోకి వచ్చింది.
బాలికతో పెళ్లి వద్దన్నందుకు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె కుటుంబసభ్యులను ఓ యువకుడు బెదిరించాడు.