Heavy Rains In Medak: మెదక్‌లో దంచికొడుతున్న వర్షం.. రాకపోకలకు అంతరాయం
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:37 PM
మెదక్ పట్టణంతో పాటు రాజీపల్లిలో 9.5, పాతూరు 8.1 సెం. మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
మెదక్: జిల్లాలో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటి వరకు కురిసిన వర్షాల నుంచి పూర్తిగా ఉపశమనం కలగకముందే.. మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రంలో.. నాలుగు గంటల వ్యవధిలో 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలకు దిగినట్లు వెల్లడించారు.
మెదక్ పట్టణంతో పాటు రాజీపల్లిలో 9.5, పాతూరు 8.1 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలకు, కాలనీలకు వరద నీరు చేరడంతో.. చెరువులను తలపిస్తున్నాయి. పలు వీధుల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో.. జనసంచారం స్థంబించిపోయింది. మెదక్ - హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీతో డివైడర్‌ని తొలగించి వరద నీరు మళ్లిస్తున్నారు. భారీ వర్షంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం