Sangareddy Electric Shock: అమీన్‌పూర్ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగికి విద్యుత్ షాక్..
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:18 AM
గత 5 ఏళ్లగా అమీన్‌పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీవాని నగర్ వేదిరి టౌన్ షిప్‌లో నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు.
సంగారెడ్డి: అమీన్‌పూర్ సబ్‌స్టేషన్ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగికి విద్యుత్ షాక్ తగిలింది. పవర్ కట్ కారణంగా లైన్‌మెన్‌తో ఎల్సీ తీస్కొని కరెంట్ పోల్ ఎక్కాడు ఓకాంట్రాక్ట్ ఉద్యోగి. ఎల్సీ తీసుకున్న సమయంలో సడెన్‌గా పవర్ ఆన్ అయ్యింది. దీంతో పోల్‌పై ఉన్న ప్రకాష్ అనే వ్యక్తికి ఒక్కసారిగా.. విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మదీనగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రకాష్ చికిత్స పొందుతున్నాడు.
గత 5 ఏళ్లగా అమీన్‌పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీవాని నగర్ వేదిరి టౌన్ షిప్‌లో నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు. మరమత్తులు చేస్తుండగా విద్యత్ షాక్‌కు గురయ్యాడు. అయితే తమకు సంబంధం లేదని సబ్ స్టేషన్ సిబ్బంది చెప్తున్నట్లు ప్రకాష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా.. కరెంట్ పోల్ ఎక్కాడని సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం