Share News

PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:11 PM

ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.

PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
PM Modi

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో సమాజంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇది బచత్ ఉత్సవం (Saving Festival) అని అభివర్ణించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసంగించారు.


ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.


పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి

కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా చేసిన కృషితో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని ప్రధాని చెప్పారు. నియో-మిడికల్ క్లాస్‌గా ఉండే ఈ 25 కోట్ల మంది ప్రజలు భారతదేశ వృద్ధి కథలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియని, దేశ అవసరాలు కాలాన్ని బట్టి మారుతుంటాయని, దేశ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ కలలను దృష్టిలో ఉంచుకుని తాజా జీఎస్టీ సంస్కరణలు తెచ్చామని చెప్పారు. రేపట్నించి కేవలం 5, 18 శాతం శ్లాబులు మాత్రమే అమల్లోకి వస్తాయని, దీంతో ప్రతి వస్తువు ధర తగ్గుతుందని చెప్పారు. ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, బ్రష్, పేస్ట్, హెల్త్ అండ్ ఇన్స్యూరెన్స్, ఇంకా పలు వస్తువులు సేవలు జీరో టాక్స్ లేదా 5 శాతం పన్నుకే పరిమితమవుతాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 07:29 PM