Share News

PM Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:18 PM

సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం కానుందని ప్రధాని మోదీ తెలిపారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం
PM Modi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendr Modi) దేశ ప్రజలకు దేవీనవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభమవుతోందని, పేద మధ్య తరగతి వర్గాలకు ఇది డబుల్ బొనంజా అని అభివర్ణించారు. జీఎస్టీతో వన్ నేషన్-వన్ ట్యాక్స్ కలలు సాకరమయ్యాయని అన్నారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.


సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ మార్పులు సహకరిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో దేశంలో రకరకాల పన్నులతో ప్రజల్లో గందరగోళం ఉండేదని, జీఎస్టీ ఆ గందరగోళం నుంచి బయటపడేసిందని చెప్పారు. రేపట్నించి నిత్సావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని, కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులు, వినియోగదారలకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. 12 శాతం పన్ను ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్నులోకి వచ్చాయని, పేదలు వాడే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు.


సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని, అదే విధంగా దేశ ప్రజల పొదుపు కూడా పెరుగుతుందని మోదీ చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఇంత పెద్ద సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోందని, వారికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు. పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. హోటల్స్ సేవలపైనా జీఎస్టీ తగ్గించామని తెలిపారు. సంస్కరణలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపులతో ఎంఎస్ఎంఈలు లాభపడతాయన్నారు.


మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలి

ప్రధాని మంత్రి ఈ సందర్భంగా మరోసారి మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలని సూచించారు. మన ఉత్పత్తుల నాణ్యత దేశ గౌరవాన్ని మరింత పెంచుతోందని, నాగరిక్‌ దేవోభవన అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 06:28 PM