Share News

Election Commission: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

ABN , Publish Date - Sep 21 , 2025 | 03:26 PM

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.

Election Commission: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం
Election Commission

న్యూఢిల్లీ: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) సమాయత్తమవుతోంది. ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీలోగా సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఓటర్ లిస్ట్ క్లీనప్ ఎక్సర్‌సైజ్‌ను అక్టోబర్-నవంబర్‌ నాటికి ప్రారంభించనున్నట్టు సంకేతాలిచ్చింది.


ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు. లాంఛనంగా సెప్టెంబర్ 30వ తేదీని చివరితేదీగా నిర్ణయించారు. చివరిసారిగా నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్‌ను సిద్ధంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చింది. గత ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల జాబితాలను పలు రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. న్యూఢిల్లీలో చివరిసారిగా 2008లో ఎస్ఐఆర్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఎస్ఐఆర్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో చివరిసారి ఎస్ఐఆర్ 2002-2004 మధ్య జరిగింది.


బిహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించనన్నట్టు ఈసీ ఇటీవల ప్రకటించింది. 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. పుట్టినస్థలం రికార్డులను పరిశీలించి అక్రమ విదేశీ వలసదారులను జాబితా నుంచి తప్పించడం ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యంగా ఉంది.


ఇవి కూడా చదవండి..

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

రేపటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు, యూఎస్‌కు కేంద్రమంత్రి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 03:31 PM