Home » Mamata Banerjee
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.
మే ఐదో తేదీ తర్వాతి నుంచి పశ్చిమ బెంగాల్ మహిళలు రాత్రి ఒంటి గంట తర్వాత కూడా భయం లేకుండా రోడ్లుపై తిరగొచ్చని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని జమాల్‌పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాలను మోహరించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది ప్రజాస్వామ్య పండుగ, ఎవర్నీ చంపే పండుగ కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్‌మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు.
మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్‌తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పందించారు. మరోసారి తన 'కట్టుకథల'తో నమ్మించేందుకే జాతినుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారని అన్నారు.
గురువారం జల్పాయ్‌గురిలో మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో మమతాను భయపెట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది కూడా ఓ అభిమాని కారణంగా మమతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తన పార్టీ 226 సీట్లలో విజయం సాధిస్తుందని టీఎంసీ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విజన ద్వారా బెంగాల్‌ను మూడు ముక్కలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచనగా ఉందని ఆరోపించారు.