Home » Local Body Elections
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని.. 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులపై పంచాయతీరాజ్ శాఖ సానుకూలంగా స్పందించింది.
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
కొమురంభీం ఆసిఫాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అభ్యర్థులు ప్రచార పర్వం కొనసాగిన ప్రతిరోజు మందు, మాంసంతో విందులు కొనసాగించారు. పల్లెలను మత్తులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇంటింటికి వెళ్లి గడపకు బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకొని మరికొందరు భూములు ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో దారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచి ఓడిన వారు తలలు పట్టుకుంటున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
లింగ మోరిగూడెంలో ప్రతిపక్ష అభ్యర్ధి రెండుసార్లు చికెన్ ఇంటింటికీ పంపించారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటుకు రూ.750ల నగదు, కిలో చికెన్ అందులో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్, లేదా బీరు చొప్పున ఇవ్వడం చర్చనీయాంశమైంది.