Share News

Local Body Elections: సర్పంచ్ ఎన్నికల్లో కోతుల బెడదే ప్రధాన ఎజెండా

ABN , Publish Date - Dec 08 , 2025 | 06:40 AM

ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి.. ఓట్లను కొల్ల గొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకుంటున్నాయి.

Local Body Elections: సర్పంచ్ ఎన్నికల్లో కోతుల బెడదే ప్రధాన ఎజెండా
Local Body Elections

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్: సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయితీ తెరపైకి వస్తోంది. డ్రైనేజీ, రోడ్లు, తాగు నీటి సమస్య దేవుడెరుగు.. ఇల్లు పీకి పందిరివేస్తున్న కోతుల సంగతి చూడండంటూ ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు షరతులు పెడుతున్నారు. దీంతో ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి.. ఓట్లను కొల్ల గొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకుంటున్నాయి. ఇంటి కప్పులే కాదు.. రైతన్నల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.


ఇళ్లలోకి చొరబడి చేతికి ఏది దొరికితే అది పట్టుకెళుతున్నాయి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ప్రతీ ఊరిలో వానర బాధితులే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల ఎజెండాలో కపిరాజుకే ప్రాధాన్యత పెరిగింది.

ఊళ్లు, పంటలపై వానర మూక

కోతుల బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లనే కాదు.. పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తూ వ్యవసాయ పనులకు వెళ్లేవారిని, ఇతర పనులకు బయటకు వచ్చే వారిని బెదిరిస్తూ గాయపరుస్తున్నాయి. అడవులు అంతరించి పోతుండటంతో కోతులకు కావాల్సిన ఆహారం లభించటం లేదు. అడవుల్లో తినేందుకు కోతులకు ఆహారం కొరత ఏర్పడటంతో వానర సైన్యం ఊళ్లల్లో తిష్టవేస్తున్నాయి.


గత ప్రభుత్వం 2020లో మంకీ పఫుడ్కోర్టులను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కోర్టుల్లో అరటి, పనస, సంత్ర, జామ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలను పెంచారు. అయితే వాటి నిర్వహణ మరిచారు. దీంతో కోతులు ఆహారం కోసం మళ్లీ ఊళ్లలోకి వస్తున్నాయి. కోతి చేష్టలతో ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 12 2025

ఏడాదిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

Updated Date - Dec 08 , 2025 | 06:40 AM