Share News

Central Govt: ఏడాదిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

ABN , Publish Date - Dec 08 , 2025 | 05:21 AM

ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ.. రాయ్‌పూర్‌-విశాఖపట్నం మధ్య నిర్మిస్తున్న ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే...

Central Govt: ఏడాదిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

  • రాయ్‌పూర్‌-విశాఖల మధ్య వడివడిగా పూర్తి: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ.. రాయ్‌పూర్‌-విశాఖపట్నం మధ్య నిర్మిస్తున్న ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఏడాదిలో అందుబాటులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదివారం వెల్లడించింది. మొత్తం రూ.16,482 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. దీన్ని ప్రస్తుత 26వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేయడం ద్వారా మొత్తం ప్రయాణ దూరాన్ని 597కి.మీ. నుంచి 465 కి.మీ.కు తగ్గించనుంది. ఈ కారిడార్‌ నిర్మాణం ద్వారా 132కి.మీ. దూరం... దాదాపు ఏడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని కేంద్రం వివరించింది.

Updated Date - Dec 08 , 2025 | 05:22 AM