Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 12 2025
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:18 AM
కుందుర్తి పురస్కారం, మాడభూషి స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ, కథా రచనపై అవగాహన శిబిరం, ‘సోమేపల్లి’ పురస్కారాల ప్రదానం, సాహితీ వేదిక పురస్కారం...
కుందుర్తి పురస్కారం
ఫ్రీవర్స్ ఫ్రంట్ & హోరు ఆధ్వర్యంలో డిసెంబరు 13న ఉస్మానియా యూనివర్సిటీలో యంగ్ పోయెట్స్ వర్క్ షాప్ జరగనుంది. దియా విఘ్నేశ్‌కు కుందుర్తి పురస్కార ప్రదానం, ‘ఆనవాళ్లు 2024’ ఆవిష్కరణ ఉంటాయి. సీతారాం, శీలా సుభద్రాదేవి, కాశీం, శ్రీరాం, అనిల్ డ్యానీ, యాకూబ్, నందిని సిధారెడ్డి పేర్ల రాము, హాతీరాం పాల్గొంటారు.
కుందుర్తి కవిత, సమత
మాడభూషి స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ
మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ డిసెంబర్ 14 సా.5.30ని.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. డి.చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన నిఖిలేశ్వర్ ‘స్మరణ’ (కథా విమర్శ) గ్రంథావిష్కరణ చేస్తారు. సభలో ఏనుగు నరసింహారెడ్డి, సుధామ, నాళేశ్వరం శంకరం, బెల్లంకొండ సంపత్ కుమార్ తదితరులు పాల్గొంటారు.
శీలా సుభద్రాదేవి(అధ్యక్షులు)
కథా రచనపై అవగాహన శిబిరం
కళాశాల విద్యార్థులలో తెలుగు కథా రచన పట్ల అభిరుచిని పెంచేందుకు ‘వేదిక’ (హైదరాబాద్), శిఖర స్కూల్ (విజయవాడ) కలిసి విజయవాడ, శిఖర స్కూల్ క్యాంపస్‌లో ‘తెలుగు కథా రచన అవగాహన శిబిరం’ను డిసెంబరు 14న నిర్వహిస్తున్నాయి. శిబిరంలో చిన్నకథల పరిచయం, సరైన తెలుగు భాషా వినియోగం, కథా నిర్మాణం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాలకు ఫోన్: 81426 42638 (అనిల్ అట్లూరి), 88976 23332 (బండ్ల మాధవరావు).
అనిల్ అట్లూరి
‘సోమేపల్లి’ పురస్కారాల ప్రదానం
చిన్న కథల పోటీలలో విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 ఉ.10.30గం.లకు అన్నమయ్య లైబ్రరీ మీటింగ్ హాల్, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరుగుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలను శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), జి. రంగబాబు (అనకాపల్లి), జి.యస్.కె. కరీముల్లా (నరసరావుపేట) స్వీకరిస్తారు. వేముల హజరత్తయ్యగుప్త, ఆర్.డి. విల్సన్, చిల్లర భవానీదేవి, శ్రీకంఠస్ఫూర్తి తదితరులు పాల్గొంటారు.
చలపాక ప్రకాష్
సాహితీ వేదిక పురస్కారం
రాజమండ్రి సాహితీ వేదిక ఈ సంవత్సరం నుండి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన, చేస్తున్న వారికి ప్రతి ఏటా ఇవ్వతలపెట్టిన సాహిత్య పురస్కారాన్ని 2025 సంవత్సరానికి గాను కవీ, కథకుడూ అద్దేపల్లి ప్రభు స్వీకరిస్తారు. డిసెంబరు 25న రాజమండ్రిలో జరిగే సాహితీ వేదిక వార్షిక సమావేశంలో అద్దేపల్లి ప్రభుకు రూ.20వేల నగదుతో పురస్కారం ప్రదానం జరుగుతుంది.
సాహితీ వేదిక
‘భూపతి చంద్ర’ కథానికల పోటీ
‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞా పురం, గజ్వేల్ నిర్వహిస్తున్న ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీకి ఆహ్వానం. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.10వేలు, 8వేలు, 6వేలు. ఐదు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ.2 వేలు. కథానికలను డిటిపిలో ఏ4 సైజు 4 పేజీలు మించకుండా జనవరి 1 లోపు ఈమెయిల్: bcmkantha@gmail.comకు, లేదా వాట్సాప్: 9959020513కు, లేదా చిరునామా: ఆనంద నిలయం, ఇం.నం.1–5–1020/4, బి.ఆర్. రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ – 500 010కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్: 99636 16999.
ఎమ్.ఎల్. కాంతారావు
తెలుగు కథల పోటీ
తిరుపతి– విశ్వశ్రీ సాహితీ సమాఖ్య, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 2026 మార్చి 19 పరాభవ నామ ఉగాది సందర్భంగా తెలుగు కథల పోటీని నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5116, రూ.3116, రూ.2116, ఐదు ప్రోత్సాహక బహు మతులు రూ.1116. ఉత్తమ 25 కథలతో ఒక సంచిక ముద్రిస్తారు. ఏ4 సైజ్‌లో 3 పుటల లోపు కథలను డిసెంబరు 31 లోగా ఈమెయిల్: viswasrikadha2025@gmail.comకు పంపాలి.
గార్లపాటి దామోదర నాయుడు
నవలా రచన పోటీ
జొన్నలగడ్డ రాంభొట్లు–సరోజమ్మ స్మారక నవలా పోటీకి ‘మారుతున్న విలువలు, చదు వులు, తల్లిదండ్రుల బాధ్యత, యువత నేప థ్యం’ అంశంపై నవలలు పంపాలి. ఉత్తమ నవలకు రూ.40వేల నగదు బహుమతి. ఎంపికైన ఇతర నవలలకు ప్రత్యేక పురస్కా రాలు. నవలలను మార్చి 1, 2026లోపు వర్డ్ లేదా, పి.డి.ఎఫ్ ఫార్మాట్‌లో పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్: 99488 96984, ఈమెయిల్: subbujvr@gmail.com.
సిరికోన సాహితీ అకాడెమీ
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News