Local Body Elections: ఏకగ్రీవాలు చేసేందుకు గ్రామ పెద్దల చర్చలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:24 AM
వీణవంక మండలంలోని 28 గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాల కోసం గ్రామాల్లోని పెద్దలు అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నారు.
వీణవంక, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 28 గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాల కోసం గ్రామాల్లోని పెద్దలు అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నారు. మండలంలోని మల్లన్నపల్లి, ఇప్పలపల్లి, బ్రాహ్మణపల్లి, దేశాయిపల్లి గ్రామాల్లో సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు తీవ్రంగా చర్చిస్తున్నారు. మల్లన్నపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి మూడు గుంటల భూమి ఇచ్చేందుకు ఓ అభ్యర్థి ముందుకు వచ్చాడు.
వార్డు సభ్యుల ఏకగ్రీవాల కోసం జోరుగా బుజ్జగింపులు చేస్తున్నారు. ఇప్పటికే 14 వార్డులకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవం కానున్నాయి. మండలంలోని 246 వార్డులకు రికార్డు స్థాయిలో 698 మంది నామినేషన్ దాఖలు చేశారు. 26 గ్రామల సర్పంచులకు గాను 157 మంది సర్పంచ్ పోటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
పాకిస్థాన్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు.. పాక్ యంత్రాంగం ఆగ్రహం..
పంచాయతీలకు గూడు కరువు.. కాబోయే సర్పంచ్‌లకు పరీక్షే..