Local Body Elections: పల్లెల్లో ఆసక్తికరంగా మారిన రాజకీయం.. వలస ఓటర్లపై అభ్యర్థుల దృష్టి
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:47 AM
స్థానిక ఎన్నికల తరుణంలో ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు అభ్యర్థులు. దీంతో వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జనగామ, డిసెంబరు 06: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ వలస ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారించారు(Local Body Elections). గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లపై ఆయా పార్టీల అభ్యర్థులు కన్నేశారు. గ్రామాల్లో ఉంటున్న వారితోపాటు వలస వెళ్లిన వారి ఓట్లు(Migrate Voters) కూడా కీలకంగా మారతాయి. ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన గ్రామాలతో పాటు నామినేషన్లు వేస్తున్న మూడో విడత అభ్యర్థులు సైతం వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. తమ గ్రామంలోని ఓటర్లు ఏయే ప్రాంతాల్లో ఉంటున్నారన్న దానిపై ఆరాతీసి వారి ఫోన్ నంబర్లను సేకరించే పనిలో పడ్డారు.
వలస ఓటర్లే కీలకం..
గ్రామ పంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల్లో చాలా సందర్భాల్లో వలస వెళ్లిన వారి ఓట్లే కీలకంగా మారతాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళుతుంటారు. హైదరాబాద్(Hyderabad)లోని ఉప్పల్, జగద్గిరిగుట్ట, నాగోల్, చింతల్, బాలానగర్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీటితో పాటు బొంబాయి, సూరత్ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటారు. చాలా మంది ఎంత దూరం వలస వెళ్లినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి ఓటు వేసేందుకు కచ్చితంగా వస్తుంటారు. ఇప్పటికీ గ్రామాల్లో ఓటు వేయడంపై చాలా మంది నిబద్ధతతో ఉంటారు. 'ఓటు వేయని వ్యక్తి మరణించిన వ్యక్తితో సమానం' అన్న భావన గ్రామీణుల్లో ఎక్కువగా ఉంటుంది.
ఇవీ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్