Home » Latest News
ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ సంస్థ క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు.
అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా అధికారులు ప్రతి వారం సమీక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎంవో అధికారులతో శనివారం MCHRDలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో క్షణికావేశంలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన ఘంటసాల మండలం దేవర కోటలో జరిగింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు.
ఏపీ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో శనివారం జరిగిన పాన్ ఐఐటీ సమ్మిట్‌లో టెక్నాలజీ ఆవిష్కరణలను సీఎం ప్రోత్సహించారు.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాసంగిలో తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. డీ లిమిటెషన్ జరిగితే తుంగతుర్తిలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.