సృష్టి సరోగసీ కేసులో మరో కీలక పరిణామం..
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:24 PM
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డా. నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హవాలా, మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక అంశాలను వెలికితీయడానికి కస్టడీ అవసరమని ఈడీ అధికారులు పేర్కొన్నారు..
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో (Doctor Namrata surrogacy case) అరెస్టైన డాక్టర్ నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సృష్టి సరోగసీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఇవాళ(మంగళవారం) ఈడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా సరోగసీ సేవలు నిర్వహిస్తూ భారీ మొత్తంలో నిధులు అక్రమ మార్గాల్లో మళ్లించినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్ర, నిధుల మూలాలను పూర్తిగా వెలికితీయడానికి కస్టడీ అవసరమని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఇటీవలే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సరోగసీ పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ డాక్టర్ నమ్రత భారీగా డబ్బు సేకరించి, హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సరోగసీ కేంద్రాలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
Read Latest Telangana News And AP News And Telugu News