Home » Kurnool
కార్తీకమాసం ప్రారంభంకావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
కంబళదిన్నె- ఎమ్మిగనూరు రోడ్డును వేయాలని సీపీఐ నాయకులు భాస్కర్‌యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, చంద్ర, తిక్కన్న డిమాండ్ చేశారు.
బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.