Share News

విషగుళికలు మింగి వ్యక్తి బలవన్మరణం

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:32 PM

విషగుళికలు మింగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కొలిమిగుండ్లలోని జగనన్న కాలనీలో చోటుచేసుకున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

   విషగుళికలు మింగి వ్యక్తి బలవన్మరణం

కొలిమిగుండ్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విషగుళికలు మింగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కొలిమిగుండ్లలోని జగనన్న కాలనీలో చోటుచేసుకున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. వివరాలు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన శరతకుమార్‌(25) శుక్రవారం రాత్రి కొలిమిగుండ్లలోని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న తనమిత్రుడు హరీశ గదికి వచ్చాడు. హరీశ అలా్ట్రటెక్‌ పరిశ్రమలో పనిచేస్తూ ఈకాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్ని సమస్యలు ఉన్నాయని, రెండు రోజులు ఇక్కడే ఉంటానని అతడు మిత్రుడితో చెప్పాడు. శనివారం హరీశ డ్యూటీకి వెళ్లిపోయాడు. కాసేపటికే రూమ్‌లోఉన్న శరతకుమార్‌ తాను విషగుళి కలు మింగానని హరీశకు వాయిస్‌ మేసేజ్‌ చేశాడు. అతడు ఇంటికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న శరతను తాడిపత్రికి, అక్కడి నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరతకుమార్‌ మృతి చెందాడు. మృతుడికి నెల రోజుల క్రితమే బళ్లారి జిల్లా సుగ్నీవ్‌ కొట్టాల గ్రామానికి చెందిన సుష్మితతో వివాహమైంది. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Dec 06 , 2025 | 11:32 PM