Share News

ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:33 PM

ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

   ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

ఫ మరో ఇద్దరికి గాయాలు

ఆదోని రూరల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : బైక్‌ను గరుసు ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళా కూలీ దుర్మరణం చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. ఈఘటన మండలంలోని కపటి శివారులో శనివారం చోటుచేసుకున్నట్లు ఇస్వీ ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. పెద్దకడుబూరు మండలం తారా పురానికి చెందిన దంపతులు గిరిస్వామి, సరస్వతీ(25). వారు కూలీ పనుల నిమిత్తం ప్రతి రోజు బైక్‌పై ఆదోనికి వస్తారు. శనివారం భార్యాభర్తలతో పాటు గిరిస్వామి తండ్రి ఉరుకుందప్ప కూడా బైక్‌పై బయలుదేరారు. వీరి వాహనం ఆదోని ఆదోని మండలం కపటి శివారుల్లోకి రాగానే గరుసును తరలిస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. అందరూ కిందపడిపోగా. సరస్వతీపై నుంచి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. రెండు కాళ్లు విరిగి, తల పగిలి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గిరిస్వామి, ఉరుకుందప్ప గాయపడగా వారిని స్థానికులు ఆదోని ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. తల్లిని కోల్పోయిన పిల్లలను ఎవరు చూసుకోవాలంటూ మృతురాలి బంధువులు రోధిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మార్చురీ వద్ద పోలీసులతో..

గ్రామానికి చెందిన ఓ సీనియర్‌ టీడీపీ నాయకుడు గరుసు దందాకు పాల్పడుతున్నాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అశోక్‌ కూడా మైనరేనని, అతనికి లైసెన్స కూడా లేదు. ట్రాక్టర్‌ డ్రైవర్‌, యజమాని వచ్చేంతవరకు పోస్టుమార్టం చేయించేది లేదని మృతురాలి బంధువులు మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ టీడీపీ నాయకుడు కూటమికి చెందిన మహిళా నాయకురాలికి అనుచరుడు కావడంతో ఆమె ఎలా గైనా పంచాయితీ చేసి ఆర్థికసాయం చేస్తామని అధికారులను వేడుకొంది. మృతురాలి బంధువులకు రూ.6లక్షలు ఇవ్వడానికి గరుసు దందా దారులు ముందుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Dec 06 , 2025 | 11:34 PM