భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:54 PM
విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అశోక్‌వర్ధన్ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్ కూమార్ సూచించారు.
పెద్దకడబూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అశోక్‌వర్ధన్ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్ కూమార్ సూచించారు. పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆత్మ సిబ్బంది, ఏవో సుచరిత ఆధ్వర్యంలో నేల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే సిబ్బంది తేజకూమార్, పాఠశాల ప్రిన్సిపాల్ రాఘవేంద్ర, వ్యవసాయ సిబ్బంది సోని, రాఘవేంద్ర పాల్గొన్నారు.