Share News

రైతులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:53 AM

కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

  రైతులకు అండగా ప్రభుత్వం
రాఘవేంద్రరెడ్డిని, అధికారులను సన్మానించిన నాయకులు

మంత్రాలయం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మండలంలోని చెట్నహళ్లిలో బుధవారం ఏవో జీరాగణేష్‌, ఆర్టికల్చర్‌ అధికారి అపర్ణ, మండల పశువైద్య అధికారి సంతోష్‌, ప్లానింగ్‌ అధికారి రాజు, తహసీల్దారు రమాదేవి, ఎంపీడీవో నూర్జహాన్‌ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం సీఎం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామాల్లో ఒకే పంటసాగు లేకుండా అంతరపంటలు, చిరుధాన్యాలు, ఉద్యానపపంటలు సాగు, బిందుసేద్యం ద్వారా సాగుచేసే విధానాలు వాటి దిగుబడి మార్కెటింగ్‌ వంటి అంశాలపై చర్చించారు. ఇందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవేంద్రరెడ్డికి, మండలస్థాయి నాయకులకు, అధికారులకు శాలువా పూలమాలలో చెట్నహళ్లి టీడీపీ నాయకులు సత్కరించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ చావడి వెంకటేష్‌, మాజీ జడ్పీటీసీ ఆర్‌.లక్ష్మయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు వరదరాజులు, సొసైటీ డైరెక్టర్లు డీసీ తిమ్మప్ప, నగేష్‌, లక్ష్మన్న, డిప్యూటీ ఎంపీడీవో రామాంజ నేయులు, ఏఈవో తిరుమలరెడి,్డ టీడీపీ నాయకులు ఎస్పీ భాస్కర్‌ రెడ్డి, సూగూరు ఎల్లెల్సీ చైర్మన్‌ నరసింహ, నాగరాజు, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:54 AM