Home » KTR
గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారుకు పంక్చర్ అయింది.
కాంగ్రెస్‌ను హైదరాబాదీలు నమ్మలేదని.. హైదరాబాద్ ఎన్నికల్లో అందుకే ఒక్క సీటూ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. ఇళ్లు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆర్టీసీ చార్జీలను పెంచడంపై బీఆర్ఎస్ ఇచ్చిన 'చలో బస్ భవన్’ పిలుపు మేరకు నిరసనకు బయల్దేరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.
మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని... దీనికి నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతమని కేటీఆర్ అన్నారు.
పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి గణేష్ సరస్వతీ పుత్రుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయిన గణేష్ అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. చిన్నప్పటి నుంచి గణేష్ చదువులో మంచిగా రాణించేవాడు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.
కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.