Home » KTR
ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వడం..
కాంగ్రెస్ సర్కార్ పనితీరుతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని ఆయన గుర్తు చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో తన కుటుంబసభ్యుల ప్రయోజనంకోసం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్‌రెడ్డి ఆకాంక్ష నెరవేరదని, ఆయన చెప్పే ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తులేదని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్(KTR) విమర్శించారు. రేవంత్ తన అవివేకంతో.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలవటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేసిందే కేసీఆర్, కేటీఆర్ అని తెలిపారు. నిర్మాణరంగానికి ముఖ్యమంత్రి నమ్మకం కల్పించలేకపోయారని పేర్కొన్నారు.
జూరాల, మంజీరా, సింగూరు బ్యారేజీలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది.