KTR Harish Rao Meeting: ఫార్ములా ఈ కారు రేస్ కేసుపై హరీష్ రావుతో కేటీఆర్ భేటీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:43 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నేపథ్యంలో ఇరువురు నేతలు ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నేపథ్యంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళితే ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫార్ములా ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అంటోన్న కేటీఆర్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే కారు రేస్‌కు తానే చొరవ తీసుకున్నానన్నారు. ఒక్క రూపాయి కూడా ఇందులో అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా, మాజీ మంత్రి కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా-ఈ కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.45 కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కారు రేస్‌లో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేయడం.. ఆ కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి రూ. 44 కోట్ల నిధులు బీఆర్‌ఎస్‌కు రావడం స్పష్టంగా కనిపిస్తోందని ఏసీబీ అంచనాకు వచ్చింది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్ ఉండటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అని హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
Also Read:రూ.25 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలతో.. ఏం జరిగిందంటే..
భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
For More Latest News